సీట్ల పంపకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
- ఏపీలో టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన
- సీట్ల పంపకం గురించి ఇంకా ప్రకటించని వైనం
- ప్రతి సీటు కూడా గెలిచే సీటు అవ్వాలన్న పవన్ కల్యాణ్
- 98 శాతం స్ట్రయికింగ్ రేటు ఉండాలని పిలుపు
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన-టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు, మాయలు అన్నింటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని తెలిపారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్లు సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే, పోటీ చేసే ప్రతి సీటు గెలిచే సీటు అవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని తమ మనసులో మాటను వెల్లడించారు.
ఎంతని కాదు, ఎన్ని అని కాదు... ప్రతి సీటు కూడా గెలిచే సీటు అవ్వాలి... తక్కువలో తక్కువగా 98 శాతం స్ట్రయికింగ్ రేటు ఉండాలి అని పిలుపునిచ్చారు. దీనికి అందరి అభిమానం కావాలి, అందరి ఆశీస్సులు కావాలి అని విజ్ఞప్తి చేశారు.