విశాఖలో టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు... స్టేడియంలో సందడి చేసిన కేఏ పాల్

  • మ్యాచ్ చూడ్డానికి స్టేడియానికి వచ్చిన కేఏ పాల్
  • తాను ఎంపీగా పోటీ చేస్తుండడంతో తనను మ్యాచ్ కు ఆహ్వానించారని వెల్లడి
  • వైజాగ్ ను ఇంటర్నేషనల్ సిటీ చేస్తానని ప్రకటన
  • తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి
విశాఖలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుండగా... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్టేడియంలో సందడి చేశారు. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేస్తుండడంతో తనను కూడా క్రికెట్ మ్యాచ్ కు ఆహ్వానించారని కేఏ పాల్ వెల్లడించారు. 

భారత్ క్రికెట్ లోనే నెంబర్ వన్ అని, ఇతర క్రీడల్లో వెనుకబడి ఉందని అన్నారు. చైనా, అమెరికా, రష్యా స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. 100 క్రీడాంశాల్లో భారత్ ను నెంబర్ వన్ గా చేసే బాధ్యత తనది అని కేఏ పాల్ ప్రకటించారు. 

క్రీడల దిశగా యువతను ప్రోత్సహించాలని, అందుకోసం వేల కోట్లు నిధులు కేటాయించాలని అన్నారు. ఇక, విశాఖను లాస్ ఏంజెలిస్, దుబాయ్ తరహాలో ఇంటర్నేషనల్ సిటీగా మార్చేద్దామని, అందుకోసం తనను ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.


More Telugu News