చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభా పక్షం భేటీ
- ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 6న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన చంద్రబాబు
- పవన్ తో భేటీ వివరాలను కూడా తమ నేతలతో పంచుకున్న టీడీపీ అధినేత
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో 10 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ యోచిస్తోంది. అప్పులు, రాయితీలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుల భూకేటాయింపు, వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపు భారం, స్థానిక సంస్థల నిధులు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్ కు భూకేటాయింపు వ్యవహారం, ఇసుక, బైరైటీస్ గనుల తవ్వకాలు, టిడ్కో ఇళ్ల అప్పగింత, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రగడపై నేటి సమావేశంలో చర్చించారు.
ఇవాళ పవన్ కల్యాణ్ తో జరిగిన సమావేశం వివరాలను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో పంచుకున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో, అభ్యర్థిని నిలబెట్టడంపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 5న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 6న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.