శత్రు భీకర ఆయుధాన్ని ఆవిష్కరించిన ఇరాన్
- టెహ్రాన్ లో సైనిక ప్రదర్శన
- షఫాక్ క్షిపణులను ప్రదర్శించిన ఇరాన్ సైన్యం
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇరాన్
ఇటీవల శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలకు దీటుగా ఎదుగుతున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ ఓ శత్రు భీకర ఆయుధానికి రూపకల్పన చేసింది. తాజాగా దీని అప్ డేటెడ్ వెర్షన్ ను ఆవిష్కరించారు. ఇది ఒక యాంటీ ఆర్మర్ మిస్సైల్ వ్యవస్థ. గగనతలం నుంచి భూ ఉపరితలానికి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణులు ఎంతో దృఢమైన యుద్ధ ట్యాంకులను, ఇతర భద్రతా వ్యవస్థలను తుత్తునియలు చేయగలవు.
ఈ యాంటీ ఆర్మర్ మిస్సైల్ కు ఇరాన్ 'షఫాక్' (ఉషోదయం) అని నామకరణం చేసింది. శనివారం నాడు ఇరాన్ లో జరిగిన ఓ సైనిక ప్రదర్శనలో ఈ స్మార్ట్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్ ను ఆవిష్కరించారు. ఇరాన్ శాస్త్రవేత్తలు, ఆయుధ నిపుణులు దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
20 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను షఫాక్ అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది. వివిధ రకాల వ్యూహాత్మక ఆపరేషన్లలో ఈ క్షిపణిని ఉపయోగించుకునే వీలుందని చైనాకు చెందిన జిన్హువా మీడియా సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా, పోరాట హెలికాప్టర్లకు ఈ క్షిపణులను అమర్చితే యుద్ధ రంగంలో పరిస్థితే మారిపోతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కసారి టార్గెట్ నిర్దేశించి దీన్ని ప్రయోగిస్తే... ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నేరుగా లక్ష్యాన్ని తాకేలా అత్యంత అధునాతన గైడెడ్ టెక్నాలజీని దీంట్లో పొందుపరిచారు. ఇన్ ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్, విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ దూసుకెళ్లగలిగే సామర్థ్యం, రాత్రివేళల్లోనూ ప్రయాణించగల సత్తా షఫాక్ సొంతం.