రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 ఆలౌట్... ఇంగ్లండ్ టార్గెట్ 399 రన్స్

  • విశాఖలో టీమిండియా-ఇంగ్లండ్ రెండో టెస్టు
  • మ్యాచ్ పై పట్టుబిగించిన భారత్
  • ఆటకు నేడు మూడో రోజు
విశాఖ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా టీమిండియాకు 398 పరుగుల ఓవరాల్ ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ విజయలక్ష్యం నిలిచింది. 

ఇవాళ్టి ఆటలో వన్ డౌన్ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ (104) సెంచరీయే హైలైట్. గిల్ తన పరుగుల కరవును తీర్చుకుంటూ సెంచరీతో చెలరేగాడు. శ్రేయాస్ అయ్యర్ 29, అక్షర్ పటేల్ 45, రవిచంద్రన్ అశ్విన్ 29 పరుగులు చేశారు. యశస్వి జైస్వాల్ 17, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే అవుట్ కాగా... రజత్ పాటిదార్ (9), కేఎస్ భరత్ (6) నిరుత్సాహపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు టామ్ హార్ట్ లే 4, రెహాన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు. ప్రధాన పేసర్ జిమ్మీ ఆండర్సన్ 2, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌట్ అయి... భారత్ కు కీలక ఆధిక్యం సమర్పించుకుంది.


More Telugu News