ఢిల్లీలో బీవైడీ కారుకు టెస్లా స్టిక్కర్.. ఫొటో షేర్ చేసిన అష్నీర్ గ్రోవర్
- ప్రపంచంలో తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారంటూ చమత్కారం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో
- కరోల్ బాగ్ లో అన్నీ దొరుకుతాయంటూ నెటిజన్ల కామెంట్లు
ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో టెస్లా కారు కనిపించడంతో ఆశ్చర్యపోయానని భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ చెప్పారు. అయితే, మరో కంపెనీ ఎలక్ట్రిక్ కారుకు టెస్లా అనే అక్షరాలను (స్టిక్కర్) అతికించినట్లు తర్వాత గుర్తించానని వివరించారు. ఆ కారును ఫొటో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కామెంట్ జోడించారు. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు.
టెస్లా అంటూ స్టిక్కర్ అతికించిన ఆ కారు బీవైడీ కంపెనీ తయారు చేసిన ఆట్టో 3 మోడల్ కారు అని, దాని ధర 34 లక్షల నుంచి ప్రారంభమవుతుందని నెటిజన్లు కామెంట్లలో తెలిపారు. కాగా, కరోల్ బాగ్ లో దొరకనిదంటూ ఏమీ లేదని ఓ నెటిజన్.. ఇండియన్ల క్రియేటివిటీకి హద్దే లేదని మరొకరు కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు.