ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తు..ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
- ‘ఆప్ కీ అదాలత్’ టీవీ షోలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
- ఇందిరా గాంధీ హయాంలోనూ కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగం అయ్యాయని వ్యాఖ్య
- ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరాక దర్యాప్తు నిలిచిపోతేనే సమస్య అని కామెంట్
ఇండియా టీవీకి చెందిన ప్రఖ్యాత ‘ఆప్ కీ అదాలత్’ షోలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ హయాంలోనూ కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగమయ్యాయని తెలిపారు. స్థాయుల్లో భేదాలు ఉండొచ్చుగానీ అప్పుడు జరిగిందే ఇప్పుడూ జరుగుతోందని అన్నారు. ఈ వ్యవహారంతో సామాన్యులపై ఎటువంటి ప్రభావం ఉండదని కూడా పేర్కొన్నారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరాక దర్యాప్తు నిలిచిపోతేనే సమస్యలు మొదలవుతాయని చెప్పారు.
జేఎమ్ఎమ్ చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జేఎమ్ఎమ్ చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.