తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన కోదండరాంకు పదవి ఇస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు?: మహేశ్ కుమార్ గౌడ్
- ప్రియాంకగాంధీ కచ్చితంగా రాష్ట్రానికి వస్తారు... ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్న కాంగ్రెస్ నేత
- బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
- కాంగ్రెస్ పాలనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడిన తెలంగాణ జన సమితి చైర్మన్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రియాంకగాంధీ కచ్చితంగా రాష్ట్రానికి వస్తారని చెప్పారు. ఆమెను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని... వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలకు విసుగువచ్చిందని... అందుకే ఇంటికి పంపించారన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పాలనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాలకు తేడా లేకుండా తయారు చేసింది వారే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సహా అన్ని లెక్కలు బయటపెడతామని హెచ్చరించారు.