'యమలీల'లో ఎవరు చేయనన్నా పెద్దగా పట్టించుకోలేదు: ఎస్వీ కృష్ణారెడ్డి
- 'యమలీల' గురించి ప్రస్తావించిన ఎస్వీ కృష్ణారెడ్డి
- అలీని హీరోగా పెడితే అతనే షాక్ అయ్యాడని వెల్లడి
- ఆ సినిమా చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదని వివరణ
- ప్రయోగాలను జనం ఆదరిస్తారని వ్యాఖ్య
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ లో 'ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఒకానొక సమయంలో ఆయన నుంచి వరుస సినిమాలు వచ్చాయి .. వరుస విజయాలను అందుకున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పి, ఆ మాటపైనే నిలబడిన దర్శకుడు ఆయన. తాజాగా ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'యమలీల' సినిమాను గురించి ప్రస్తావించారు.
"ఈ సినిమాకి హీరోగా అలీ కరెక్ట్ అనిపించి అతనిని పిలిపించాను .. నువ్వే హీరోవి అని అంటే అతను షాక్ అయ్యాడు. ఆ సినిమాకి పారితోషికంగా అప్పట్లో 50 వేలు ఇచ్చాము. అలీ హీరో ఏంటండీ అని కొంతమంది హీరోలు నాతో అన్నారు. ఆ సినిమాకి ఆయనే కరెక్టు అని నేను చెప్పాను. ఆయనతో చేయడానికి సౌందర్య ఒప్పుకోలేదు. ఫరవాలేదమ్మా అనేసి నా ప్రయత్నం నేను చేస్తూ వెళ్లాను" అని అన్నారు.
"ఆ సినిమాలో విలన్ గా కోట శ్రీనివాసరావుగారిని అడిగితే, ఆయన కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు కూడా ఫరవాలేదులెండి అనేశాను. ఎందుకంటే ఆ కథపైనా .. ఆ కథకి అలీ మాత్రమే సరిపోతాడనే విషయాన్ని నేను అంతగా నమ్మాను. అందువలన ఎవరు చేయనని చెప్పినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైనా సరే ప్రయోగాలను జనం ఆదరిస్తారుగానీ .. ఇండస్ట్రీ మాత్రం ఆదరించదు' అని చెప్పారు.