పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజీనామా

  • రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన పురోహిత్
  • చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి కూడా రాజీనామా
  • వ్యక్తగత కారణాలతో రాజీనామా చేస్తున్నానన్న పురోహిత్
పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. వ్యక్తిగత కారణాలు, కమిట్ మెంట్ల వల్ల రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నిన్న కలిసిన పురోహిత్ ఈరోజు రాజీనామా చేయడం గమనార్హం. 

కొంతకాలంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పురోహిత్ కు విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరిస్తూ ఇటీవల భగవంత్ మాన్ కు పురోహిత్ లేఖ కూడా రాశారు. ఈ లేఖపై భగవంత్ మాన్ స్పందిస్తూ... శాంతి ప్రేమికులను గవర్నర్ బెదిరించారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.


More Telugu News