సిద్ధం సభ కోసం బస్సు డ్రైవర్ అవతారమెత్తిన పేర్ని నాని... వీడియో ఇదిగో!

  • ఏలూరు-దెందులూరు మధ్య సీఎం జగన్ సిద్ధం సభ
  • మచిలీపట్నం నుంచి కార్యకర్తలను తీసుకెళ్లిన పేర్ని నాని
  • స్వయంగా బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన మాజీ మంత్రి
  • అదే బస్సులో పేర్ని నాని తనయుడు
నేడు ఏలూరు-దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో సీఎం జగన్ సిద్ధం సభ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, సిద్ధం సభ కోసం మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు డ్రైవర్ గా మారారు. ఆయన మచిలీపట్నం నుంచి వైసీపీ కార్యకర్తలతో కూడిన బస్సును స్వయంగా నడుపుతూ ఏలూరు తీసుకెళ్లారు.

 ఈ బస్సులో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు (పేర్ని కృష్ణమూర్తి) కూడా ఉన్నారు. పేర్ని కిట్టుకు మచిలీపట్నం వైసీపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పేర్ని నాని గతంలో  రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నేషనల్ హైవేపై ఎలాంటి తడబాటు లేకుండా సాఫీగా బస్సు నడిపారు. వైసీపీ లోగో ఉన్న టీషర్టు, వైసీపీ రంగులున్న టోపీ ధరించిన పేర్ని నాని... రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాల్లోని వారికి అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News