విశాఖ టెస్టు: 136 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
- విశాఖలో టీమిండియా, ఇంగ్లండ్ రెండో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్
- 22 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
- రెండు వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీసిన బుమ్రా
విశాఖ టెస్టులో పరిస్థితులను తన అదుపులోకి తెచ్చుకునేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 209 పరుగులతో కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు.
అనంతరం, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఓ దశలో భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. 1 వికెట్ నష్టానికి 114 పరుగులు పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ ఆ తర్వాత 22 పరుగుల తేడాతో 3 కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
76 పరుగులు చేసిన ఓపెనర్ జాక్ క్రాలే ... అక్షర్ పటేల్ బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే జో రూట్ (5), ఓల్లీ పోప్ (23)లను అవుట్ చేసిన బుమ్రా ఇంగ్లండ్ ను గట్టి దెబ్బ కొట్టాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 33 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు. జానీ బెయిర్ స్టో 24, కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 241 పరుగులు వెనుకబడి ఉంది.