నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను: పూనమ్ పాండే
- గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే చనిపోయినట్టు నిన్న వార్తలు
- ఈ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారన్న పూనమ్
- ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే తాను చనిపోయినట్టు ప్రచారం చేయించామని వెల్లడి
యువ సినీ నటి, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిన్న సంచలనాన్ని రేపింది. చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్తలు వచ్చిన ఒక రోజు తర్వాత పూనం పాండే అందరి ముందుకు వచ్చారు.
సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనమ్ పాండే చెప్పారు. తాను బతికే ఉన్నానని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని... అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశామని చెప్పారు. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.
పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయారంటూ నిన్న ఆమె మేనేజన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు.