భయపెడుతున్న కేన్సర్ భూతం.. 2050 నాటికి ఏటా మూడున్నర కోట్ల మంది బాధితులు

  • పొగాకు, ఆల్కహాల్, వాయుకాలుష్యమే కారణం
  • మరణాలు కూడా రెట్టింపు
  • హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ఏజెన్సీ
కేన్సర్ భూతం భయపెడుతోంది. 2050 నాటికి కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏడాదికి మూడున్నర కోట్ల మంది దాని బారినపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన అంతర్జాతీయ కేన్సర్ అధ్యయన సంస్థ (ఐఏఆర్‌సీ) హెచ్చరించింది. ఇందుకు పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం, వాయు కాలుష్యం వంటివి ప్రధాన కారణాలు అవుతాయని తెలిపింది. 115 దేశాల్లో నిర్వహించిన సర్వే అధ్యయన ఫలితాలను తాజాగా ప్రచురించింది. 

2050 నాటికి హై హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (హెచ్‌డీఐ) దేశాల్లో కేన్సర్ పెరుగుదల అత్యధికంగా (4.8 కోట్లు) ఉండే అవకాశం ఉందని అంచనా. తక్కువ హెచ్ఐడీ దేశాల్లో 142 శాతం, మధ్యస్థ హెచ్‌డీఐ దేశాల్లో 99 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. అంతేకాదు, తక్కువ, మధ్యస్థ హెచ్‌డీఐ దేశాల్లో కేన్సర్ మరణాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. కాబట్టి పెరుగుతున్న ఈ సంక్షోభాన్ని నివారించే తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెప్పింది.


More Telugu News