ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్
- 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం
- అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
- 12 సంవత్సరాల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానం మళ్లీ తెరపైకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లుండి (5న) టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రెండింటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో మొత్తం 6,100 పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే, పుష్కరకాలం క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు.
ఇందులో భాగంగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అప్రెంటిస్‌షిప్ సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అప్రెంటిస్‌షిప్ సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.