కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోంది: బీజేపీ నాయకురాలు డీకే అరుణ
- లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారెంటీల అమలు అంటున్నారని విమర్శ
- బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందన్న డీకే అరుణ
- సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ ఎందుకు ఎన్నికలు జరపడం లేదు? అని ప్రశ్న
కాంగ్రెస్ పాలన చూస్తోంటే కేసీఆర్ దారిలోనే నడుస్తోన్నట్లుగా కనిపిస్తోందని బీజేపీ నాయకురాలు డి.కె.అరుణ విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిన్నటి వరకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్... ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తే వాటిని అమలు చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ప్రజలు గెలిపించలేదని... బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతే వారిని గెలిపించిందన్నారు.
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ ఎందుకు ఎన్నికలు జరపడం లేదు? అని డీకే అరుణ ప్రశ్నించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిపోయినప్పటికీ వారికి బిల్లులు రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచ్‌ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.