షర్మిలను, నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు: డాక్టర్ సునీత
- ట్రోలింగ్ పై పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె
- జుగుప్స కలిగేలా రాస్తున్నారని ఆవేదన
- పులివెందుల ఎమ్మెల్యేకు బాధ్యత లేదా? అంటూ ఆగ్రహం
ఇటీవల ఇడుపులపాయలో వైఎస్ షర్మిలను వివేకా కుమార్తె డాక్టర్ సునీత కలవడం తెలిసిందే. అయితే, షర్మిలను తాను కలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని సునీత వెల్లడించారు.
షర్మిలపైనా, తనపైనా ఆ పోస్టుల్లో నీచంగా రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ అంత ఘోరంగా ఎలా రాస్తారో అర్థం కావడంలేదని, అంత అసభ్యకరమైన భాషను తాను ఎప్పుడూ చూడలేదని వాపోయారు. ఆ రాతలు ఎవరికీ చెప్పుకోలేని విధంగా, ఎంతో జుగుప్స కలిగించేలా ఉన్నాయని సునీత పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ట్రోల్స్ ను గమనిస్తుంటే, ఆ ట్రోలింగ్ ఇప్పుడే కాదని, చాలాకాలంగా జరుగుతోందన్న విషయం అర్థమైందని వివరించారు.
తనను చంపెయ్యాలా అనే విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయని, ఇక వీటిని ఉపేక్షించరాదన్న ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఇలాంటి తప్పులు జరుగుతుంటే, ఆ తప్పులను ఖండించడం కూడా చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్దాయన అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై కొడుకు కూడా స్పందించాలి కదా... ఆ కొడుకు ఒక లీడర్ కూడా కదా అని సునీత వ్యాఖ్యారించారు. లీడర్ గా తనకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నాకు, షర్మిలకే ఇలా జరుగుతుంటే, ఏపీలో మిగతావాళ్ల పరిస్థితి ఏంటి? అని ఆక్రోశించారు.
"ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పేరుతో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు తాను చేయలేదని, తన పేరుతో నకిలీ అకౌంట్ సృష్టించి ఈ పోస్టులు పెట్టారంటూ అతడే పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశాడట. పులివెందులలో ఎమ్మెల్యే ఎవరండీ... ఆయనకు బాధ్యత ఉండదా? ఇంట్లో ఆడవాళ్లకే రక్షణ ఇవ్వలేకపోతే, ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?" అంటూ సునీత ధ్వజమెత్తారు.