మైలవరం వైసీపీ ఇన్చార్జిగా జడ్పీటీసీ సభ్యుడు తిరుమలరావు!
- మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు నిరాశ!
- నేడు మంత్రి జోగి రమేశ్, కేశినేని నానితో సీఎం జగన్ చర్చలు
- మైలవరం ఇన్చార్జిగా తిరుమలరావు పేరు దాదాపుగా ఖరారు
- సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపిన తిరుమలరావు
ఎన్నికల నేపథ్యంలో ఏపీ అధికారపక్షం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వారి సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని భావిస్తే, వారిని ఇతర నియోజకవర్గాలకు పంపించేందుకు వైసీపీ అధినాయకత్వం ఏమాత్రం వెనుకాడడంలేదు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రసవత్తర రాజకీయాలు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు వైసీపీ నో చెప్పినట్టు తెలుస్తోంది. జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావును మైలవరం ఇన్చార్జిగా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం. సీఎం జగన్ ను కలిసి తిరుమలరావు ధన్యవాదాలు తెలపడంతో, మైలవరం నూతన ఇన్చార్జి ఆయనే అన్న విషయం దాదాపుగా ఖరారైనట్టే.