విశాఖలో డబుల్ సెంచరీ దిశగా యశస్వి జైస్వాల్
- విశాఖలో టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- తొలి రోజు ఆట చివరికి 6 వికెట్లకు 336 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు
- 179 పరుగులతో క్రీజులో ఉన్న యశస్వి జైస్వాల్
యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ఇవాళ టీమిండియా-ఇంగ్లండ్ రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 179 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో నిలిచాడు. మొత్తం 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 17 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు.
తొలి రోజు ఆట చివరికి మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఇవాళ్టి ఆటలో జైస్వాల్ బ్యాటింగే హైలైట్. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ ఉదయం టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచాడు. మరో ఎండ్ లో, ఇతర బ్యాట్స్ మెన్ భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమైనా, తాను మాత్రం ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసి సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 14, శుభ్ మాన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27, రజత్ పాటిదార్ 32, అక్షర్ పటేల్ 27, కేఎస్ భరత్ 17 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, రెహాన్ అహ్మద్ 2, ఆండర్సన్ 1, టామ్ హార్ట్ లే 1 వికెట్ తీశారు.