73 వేల మార్క్ ను అధిగమించిన సెన్సెక్స్

  • ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపిన కేంద్ర మధ్యంతర బడ్జెట్
  • 440 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 156 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు ఫుల్ జోష్ కనిపించింది. మధ్యంత బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకపోవడం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలో మార్కెట్లు ఈరోజు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 73 వేల మార్క్ ను అధిగమించి... 73,089కి చేరుకుంది. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారీ లాభాలు ఆవిరయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 72,086కి చేరుకుంది. నిఫ్టీ 156 పాయింట్లు ఎగబాకి 21,854 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.10%), ఎన్టీపీసీ (3.34%), టీసీఎస్ (2.98%), టాటా స్టీల్ (2.89%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.74%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.42%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.33%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.81%), ఐటీసీ (-0.60%), ఎల్ అండ్ టీ (-0.57%).


More Telugu News