జనవరి 2 నాటికే భూమిని సిద్ధం చేసి, లేఖ రాశాం.. విశాఖ రైల్వే జోన్ రగడపై జిల్లా కలెక్టర్ స్పష్టీకరణ!

  • నిన్న ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశం
  • రైల్వే జోన్ జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యలు
  • తాము అడిగిన 53 ఎకరాల భూమి ఇప్పటికీ కేటాయించలేదని ఆరోపణ 
  • రైల్వే శాఖకు లేఖ రాస్తే స్పందన రాలేదని వెల్లడి
ఏపీకి కేటాయించిన విశాఖ రైల్వే జోన్ ఆలస్యంపై నిన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రైల్వే జోన్ ఏర్పాటుకు తాము 53 ఎకరాలు అడిగామని, తాము అడిగిన భూమి కేటాయిస్తే జోన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కానీ, ఏపీ ప్రభుత్వం తమకు భూమిని అప్పగించలేదని, అందుకే జోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, అందుకు ఏపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున స్పందించారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం జనవరి 2 నాటికే భూమిని సిద్ధం చేశామని స్పష్టం చేశారు. క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని తెలిపారు. 

భూమి కేటాయింపు అంశంపై తాము రైల్వే శాఖకు లేఖ రాశామని, కానీ అట్నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. ఎప్పుడు వచ్చినా భూమిని అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


More Telugu News