చాట్ జీపీటీతో వధువు దొరికింది.. రష్యన్ యువకుడి ఆనందం!
- ఏడాది పాటు ఆన్ లైన్ లో డేటింగ్
- జవాబిచ్చేందుకు చాట్ జీపీటీ సాయం తీసుకున్న రష్యన్
- 5 వేల మందితో చాటింగ్ చేసి ఒక్కరిని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడి
చాట్ జీపీటీతో తనకో చక్కటి జీవిత భాగస్వామి దొరికిందని రష్యా యువకుడు సంబరపడుతున్నాడు.. వేల మందిని వడపోసి తనకు సరిగ్గా సరిపోయే అమ్మాయిని వెతికి పెట్టిందని చెబుతున్నాడు. ఏడాది పాటు ఆన్ లైన్ లో తన తరఫున చాటింగ్ చేసి, ఆమె అభిరుచులు తెలుసుకుని సజెస్ట్ చేసిందన్నాడు. తొలిసారి ప్రత్యక్షంగా కలుసుకున్నాక తన సోల్ మేట్ ఆమేనన్న అభిప్రాయం కలిగిందని వివరించాడు. చక్కటి భాగస్వామిని వెతికిపెట్టినందుకు చాట్ జీపీటికి ధన్యవాదాలు చెబుతున్నాడు.
రష్యాకు చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ అలెగ్జాండర్ ఝాదాన్ (23) వివాహం చేసుకోవడానికి చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. ఆన్ లైన్ డేటింగ్ యాప్ లలో వందలు, వేల సంఖ్యలో అమ్మాయిలతో చాటింగ్ చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. తొలుత చాట్ జీపీటీని తన ఆలోచనలకు సరిపోయేలా తీర్చిదిద్దాడు. అవసరమైన ట్రైనింగ్ (ఫీడింగ్) ఇచ్చాక డేటింగ్ యాప్ లలో తన తరఫున చాట్ చేసేందుకు ఉపయోగించాడు.
ఇలా ఏడాదిపాటు దాదాపు 5 వేల మంది అమ్మాయిలతో చాటింగ్ చేశాక అందులో నుంచి కరీనా ఇమ్రానోవ్నా అనే అమ్మాయిని చాట్ జీపీటీ తనకు సజెస్ట్ చేసిందని ఝాదాన్ చెప్పాడు. కరీనాను నేరుగా కలుసుకుని మాట్లాడాలన్న చాట్ జీపీటీ సూచనను పాటించినట్లు వివరించాడు. కరీనాను కలుసుకున్న క్షణంలో ఆమె తనకు సరైన జీవిత భాగస్వామి అని అనిపించిందని చెప్పాడు. ఆపై మరికొంతకాలం డేటింగ్ చేశాక వివాహానికి ప్రతిపాదన చేశానని, కరీనా అంగీకరించడంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యామని ఝాదాన్ వివరించాడు.