హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీఎస్‌కు కొత్త ఇన్‌స్పెక్టర్

  • గురువారం పీఎస్ బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్ బండారి శోభన్
  • 2007 బ్యాచ్‌కు చెందిన శోభన్.. 2014 వరకూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు
  • 2022-23 మధ్యలో యూఎస్ పీస్ కీపింగ్ మిషన్స్‌లో పాల్గొన్న వైనం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీఎస్ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా ఇన్‌స్పెక్టర్‌గా బండారి శోభన్ నియమితులయ్యారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసులో సహకరించిన ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పంజాగుట్ట పీఎస్ ప్రక్షళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిబ్బంది సస్పెన్షన్, బదిలీలు చేపట్టారు. పీఎస్‌ బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ బండారి శోభన్‌కు అప్పగించారు. 

2007 బ్యాచ్‌కు చెందిన శోభన్ 2014 వరకూ సైబరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించారు. ఆ తరువాత నిజామాబాద్‌కు బదిలీపై వెళ్లారు. 2020లో 317 జీవో కారణంగా తిరిగి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. 2022 నుంచి 2023 వరకూ ఏడాది పాటు యూఎన్ పీస్ మిషన్‌లో భాగంగా సౌత్ సుడాన్ లో  విధులు నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తరువాత సిటీ కమిషనరేట్‌లో పనిచేస్తున్న శోభన్, తాజాగా పంజాగుట్ట పీఎస్‌కు బదిలీఅయ్యారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.


More Telugu News