ఏపీలో కులగణనకు వేలిముద్ర.. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయంటూ కోనసీమ జిల్లాలో ఫిర్యాదులు
- కులగణన సందర్భంగా వేలిముద్రలు తీసుకుంటున్న వలంటీర్లు, సచివాలయ సిబ్బంది
- వేలిముద్ర వేసిన తర్వాత ఖతాల నుంచి నగదు డెబిట్
- బ్యాంకుల నంచి మెసేజ్‌లు రావడంతో లబోదిబోమంటున్న బాధితులు
- పోలీసులు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న కులగణన వల్ల తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు కట్ అవుతున్నాయంటూ కొందరు వాపోతున్నారు. డబ్బులు డెబిట్ అయ్యాయంటూ మెసేజ్‌లు రావడంతో బాధితులు బ్యాంకులకు పరుగులు తీశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిందీ ఘటన.
స్థానికుల కథనం ప్రకారం.. గత నెల 31న పొడగట్లపల్లిలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేసుకుని వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తమ ఖాతాలో డబ్బులు డెబిట్ అయినట్టు బాధితుల ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి.
అలాగే, రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ క్రయవిక్రయాలు చేసే వారు కూడా ఈకేవైసీకి వేలిముద్రలు ఇచ్చిన కాసేపటికే వారికీ అలాంటి మెసేజ్‌లు వచ్చాయి. వెదిరేశ్వరంలో 10 మందికి, రావులపాలెంలో 15 మందికి ఇలాంటి మెసేజ్‌లు రావడంతో వారంతా బ్యాంకులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అలాగే, సైబర్ పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు.