ఒకటో తేదీనే వేతనాలు పడడం చూసి తన భార్య నమ్మడం లేదంటూ రేవంత్‌రెడ్డికి ఉద్యోగి ట్వీట్
- చాలా జిల్లాల్లో నిన్ననే వేతనాలు అందుకున్న ఉద్యోగులు
- ‘ఎక్స్’ ద్వారా ఆనందం పంచుకున్న ఓ ఉద్యోగి
- అతడి ఎక్స్‌ను కోట్ చేస్తూ సీఎంవో ప్రకటన
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు నమ్మలేనంత సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఒకటో తేదీనే పడిన వేతనాలను చూసుకుని మురిసిపోతున్నారు. ఈమధ్యన ఏనాడు ఫస్ట్ తారుఖునే జీతాల ముఖం చూడని వారు బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే పట్టరాని ఆనందంలో తేలిపోతున్నారు. ఉద్యోగుల పరిస్థితే కాదు.. వారిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన ‘ఎక్స్’ ద్వారా తెలుస్తోంది.
ఒకటో తేదీనే జీతాలు పడడం చూసి తన భార్య నమ్మలేకపోతోందంటూ ఆ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఎక్స్ చేశాడు. అది చూసిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి అయోధ్యరెడ్డి దానిని ఉటంకిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని జిల్లాల్లో ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందినట్టు అందులో పేర్కొన్నారు.