అమెరికా వీసా ఫీజులు పెరిగాయి... వివరాలు ఇవిగో!
- నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచిన అమెరికా
- హెచ్1బీ, ఎల్1, ఈబీ5 వీసాల ఫీజుల పెంపు
- పెంచిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి వర్తింపు
అగ్రరాజ్యం అమెరికా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచింది. హెచ్1బీ, ఎల్1, ఈబీ5 వీసాల ఫీజు, దరఖాస్తు ఫీజును పెంచుతూ ఓ ప్రకటన చేసింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వీసా పాత ఫీజు కొత్త ఫీజు
హెచ్1బీ రూ.38,160 రూ.64,706
హెచ్1బీ రిజిస్ట్రేషన్ రూ.829 రూ.17,835
ఎల్1 రూ.38.160 రూ.1,14,887
ఈబీ6 రూ.3,04,845 రూ.9,25,718
హెచ్1బీ వీసా: ఇతర దేశాల వృత్తి నిపుణులకు అమెరికాలో ప్రవేశం కోసం ఈ వీసాలు జారీ చేస్తారు.
ఎల్1 వీసా: వివిధ దేశాల్లో బ్రాంచిలు ఉన్న అమెరికన్ కంపెనీలు ఆయా బ్రాంచిల నుంచి అమెరికాలో పనిచేసేందుకు ఉద్యోగులను రప్పిస్తుంటాయి. ఈ అంతర్గత బదిలీలపై వచ్చేవారికి ఇచ్చే వీసాను ఎల్1 వీసాగా పరిగణిస్తారు.
ఈబీ5 వీసా: అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే వీసాలు ఇవి. రూ.4 కోట్లు, అంతకుమించి పెట్టుబడి పెట్టగలిగి ఉండి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించగల పెట్టుబడిదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఈబీ5 వీసాలు కేటాయిస్తారు.