50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్... ఘనంగా వేడుకలు
- 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన గోదావరి ఎక్స్ ప్రెస్
- నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎక్స్ ప్రెస్
- విశాఖలో ఈ సాయంత్రం కేక్ కట్ చేసిన అధికారులు, ప్రజలు
- ప్రతి ప్రధాన స్టేషన్ లోనూ ఇదే తరహా వేడుకలు
హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నేటితో ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది.
1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో నడిచిన గోదావరి ఎక్స్ ప్రెస్ కాలక్రమంలో డీజిల్ ఇంజిన్ తోనూ పరుగులు తీసింది.
కాగా, ఈ రైలు సిల్వర్ జూబ్లీ వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైలును అందంగా ముస్తాబు చేశారు. ఈ సాయంత్రం విశాఖలో గోదావరి ఎక్స్ ప్రెస్ బయల్దేరే ముందు ప్రజలు, రైల్వే శాఖ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. హైదరాబాద్ వరకు ఈ ఎక్స్ ప్రెస్ ఆగే ప్రధాన స్టేషన్లలో ఇలాగే వేడుకలు జరపనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.