విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు నేరుగా విమాన సర్వీసులు
- విశాఖ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు విమానాలు
- ఏప్రిల్ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు సర్వీసులు
- ప్రణాళికలు రూపొందించిన ఎయిర్ ఏషియా
- త్వరలో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా విమాన సర్వీసు
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసుల సంఖ్య పెరగనుంది. విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నారు.
ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి ఈ రెండు ఆగ్నేయాసియా నగరాలకు ఎయిర్ ఏషియా ఎయిర్ లైన్స్ సంస్థ విమానాలు నడపాలని నిర్ణయించింది. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసు... ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ విమాన సర్వీసు నడిపేందుకు ఎయిర్ ఏషియా ప్రణాళికలు రూపొందింది.
అంతేకాదు, విశాఖ-హైదరాబాద్ మధ్య త్వరలోనే మరో ఎయిరిండియా సర్వీసు ప్రారంభం కానుంది. జూన్ నాటికి విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు.
విశాఖ విమానాశ్రయం రన్ వే ఆధునికీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తవుతాయి. ఏప్రిల్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టులో పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు జరగనున్నాయి.