రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
- పన్ను శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటన
- కార్పొరేట్ ట్యాక్స్ రేటు 22 శాతానికి తగ్గించిన కేంద్ర మంత్రి
మధ్యంతర బడ్జెట్ లో వేతన జీవులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఏడాదికి రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్ స్పీచ్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగులను కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహించేందుకు ఈ మినహాయింపును ప్రకటించినట్లు తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబులలో మాత్రం ఎలాంటి మార్పులేదని వివరించారు.
ఈ ఏడాది ప్రభుత్వానికి పన్నుల ఆదాయం రూ.26.02 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇక కార్పొరేట్ పన్ను శాతం విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం ఉండగా.. ఇకపై కార్పొరేట్ల నుంచి 22 శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరగగా.. పరోక్ష పన్నుల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదని మంత్రి వివరించారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు కాగా.. ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక ఈ ఏడాది అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.