బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- మరికాసేపట్లో లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం
- అద్భుతాలు ఆశించవద్దన్న నిర్మలా సీతారామన్
- ఎన్నికల బడ్జెట్ కావడంతో ఆదాయ పన్ను, ఉద్యోగాలపై స్పెషల్ ఫోకస్?
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్ లో వివిధ వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తాత్కాలిక బడ్జెట్ కావడంతో పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దంటూ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
బడ్జెట్ లో ఈసారి కూడా వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉందని, ఉద్యోగ కల్పన, నిర్మాణ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా, పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేక పోయిందని ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.51 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం టార్గెట్ గా పెట్టుకోగా.. డీఐపీఏఎం వెబ్ సైట్ ప్రకారం ఇప్పటి వరకు కేవలం రూ.10,051.73 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది.