ఎన్నికలకు కోలీవుడ్ నటుడు విజయ్ రెడీ.. పార్టీ పేరు ఇదే!
- 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పావులు
- త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించే ఎత్తుగడ
- ప్రజలు, అభివృద్ధి, తమిళనాడు కలిసి వచ్చేలా పార్టీ పేరు
- ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద నమోదు?
తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఒక్కడే. ఇప్పుడీ స్టార్‌డమ్‌ను ఉపయోగించుకుని రాజకీయాల్లోనూ కాలుమోపబోతున్నాడు. ‘దళపతి’ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేస్తూ వస్తున్నాయి. అందుకు ఊతమిచ్చేలా అభిమానులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాల్లో వేడి పుట్టించింది.
విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైందని, 2026 శాసనసభ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్టు సమాచారం.
తమిళ మున్నేట్ర కళగం
పార్టీ పేరులో ప్రజలు, తమిళనాడు, అభివృద్ధి కలిసి ఉండేలా ‘తమిళ మున్నేట్ర కళగం’ అనే పేరుపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసినట్టు కూడా చెబుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆ పై తప్పుకున్న వేళ విజయ్ మాత్రం పట్టుదలతో ముందుకెళ్తున్నాడు.