కేసీఆర్ గారైనా అల్లుడిని పిలిచి గడ్డి పెట్టాలి: రేవంత్ రెడ్డి సూచన
- మేం ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే హరీశ్ రావు శాపనార్థాలు పెడుతున్నారని ఆగ్రహం
- తమ ప్రయత్నాన్ని కేసీఆర్ ఆశీర్వదించాలని సూచన
- లేకుంటే ఆయనకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర దండుగ అని అనుకునే ప్రమాదమని హెచ్చరిక
- హరీశ్ రావు శాపనార్థాలకు ఉట్టి కూడా తెగదని చురక
"మేం ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే హరీశ్ రావు మా ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు... కనీసం కేసీఆర్ గారు అయినా అల్లుడిని పిలిచి గడ్డి పెట్టాలి" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తాము ఉద్యోగాలు ఇస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆశీర్వదించాలని... లేదంటే మీకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగ అని అనుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అడ్డంకులు తొలగించుకుంటూ... ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే మీ అల్లుడు హరీశ్ రావు ప్రభుత్వంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కనీసం మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టాలన్నారు. పేద బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా వేలాది కుటుంబాలు నిలబడుతున్నాయన్నారు. ఉద్యోగాలు ఇస్తుంటే హరీశ్ రావు శాపనార్థాలు పెట్టడం చూస్తుంటే మీ వంకర బుద్ధి అర్థమవుతోందన్నారు. ఆయన శాపనార్థాలకు ఉట్టి కూడా తెగదన్నారు. అవాకులు చెవాకులు పలకడం కాదని, ఒక్కసారి ఉద్యోగాలు వచ్చిన పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడాలని అన్నారు.