షర్మిలకు భద్రత తగ్గింపు... ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
- తెలంగాణలో షర్మిలకు 4 ప్లస్ 4 సెక్యూరిటీ
- ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల
- షర్మిల భద్రత 1 ప్లస్ 1కు కుదింపు
- భద్రత పెంచాలని జనవరి 22న డీజీపీకి లేఖ రాసిన షర్మిల
- ఇదే అంశాన్ని సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు
ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 4 ప్లస్ 4 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాల్లో ప్రవేశించగా, ఇక్కడి ప్రభుత్వం దాన్ని 1 ప్లస్ 1 కు తగ్గించింది. దాంతో షర్మిల తనకు భద్రత పెంచాలని కోరుతూ ఈ నెల 22న రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో షర్మిలకు భద్రత తగ్గించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాల కోసం షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని రఘువీరా, సుంకర పద్మశ్రీ వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ భద్రతతో షర్మిల పర్యటనలు చేయడం ఏమంత క్షేమకరం కాదని అభిప్రాయపడ్డారు. షర్మిల లేఖ రాసిన మేరకు ఆమెకు 4 ప్లస్ 4 సెక్యూరిటీతో పాటు, ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.