కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన కాగ్
- ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చిన కాగ్
- ప్రణాళికల నుంచి ఆర్థిక వనరుల సమీకరణ వరకు ఆడిట్ నిర్వహణ
- బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో నివేదికను ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించినట్లు అకౌంటెంట్ జనరల్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళిక, పనులు, అంచనా వ్యయం, అనుమతులు, ఆర్థిక వనరుల సమీకరణపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఉభయ సభల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదికను ఇచ్చినట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. పునరావాసం, డిజైన్ మొదలు టెండరింగ్ విధానం, వృథా ఖర్చు, చెల్లింపులు, అంచనాలు... ఇలా అన్నింటిపై ఆడిట్ చేసింది. అలాగే ఈ ప్రాజెక్టుపై లేవనెత్తిన అభ్యంతరాలు, గత ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో కూడిన పూర్తి వివరాలను నివేదికలో పొందుపరిచింది.