నేటితో ముగిసిన పదవీ కాలం... హైకోర్టులో తెలంగాణ సర్పంచ్‌ల పిటిషన్
- సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లేదంటే తమ పదవీ కాలం పొడిగించాలని కోరిన సర్పంచ్‌లు
- ప్రత్యేక అధికారులను నియమించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరిన సర్పంచ్‌లు
- తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన కోర్టు
జనవరి 31తో తమ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే తమ పదవీ కాలం పొడిగించేలా సూచించాలని తెలంగాణ సర్పంచ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజుతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు.
గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే తమ పదవీ కాలం పొడిగించేలా సూచించాలని కోరారు. కానీ ప్రత్యేక అధికారులను నియమించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.