పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువును మరోసారి పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
- పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువును మరో పదిహేను రోజులు పొడిగించిన ప్రభుత్వం
- ఫిబ్రవరి 15వ తేదీ వరకు మరోసారి గడువు పొడిగింపు
- 3.59 కోట్ల చలాన్లు ఉండగా 1.50 కోట్ల చలాన్ల చెల్లింపుల పూర్తి
పెండింగ్‌లో ఉన్న మీ వాహన ట్రాఫిక్ చలాన్లను మీరు ఇంకా చెల్లించలేదా? ఈ రోజుతో గడువు ముగిసిందని ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే... పెండింగ్ ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్‌ను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువును పొడిగించింది.
వివిధ వాహనాలపై భారీ డిస్కౌంట్‌తో చలాన్ల చెల్లింపుకు గత ఏడాది డిసెంబర్ 26న ప్రభుత్వం అవకాశం కల్పించింది. తొలుత జనవరి 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 31 వరకు రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ చెల్లింపుకు అవకాశమిచ్చింది. తాజాగా మరోసారి మరో పదిహేను రోజుల గడువు ఇచ్చింది.
పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండగా దాదాపు 1.50 కోట్ల చలాన్లకు పైగా చెల్లింపులు జరిగాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ.135 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. టూ వీలర్స్, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, ఇతర వాహనాలపై 60 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.