అత్యవసర పరిస్థితుల్లో ఆ సీరియల్ నన్ను ఆదుకుంది: 'బిగ్ బాస్' ప్రియాంక జైన్
- బిగ్ బాస్ హౌస్ కి ఆకర్షణగా నిలిచిన ప్రియాంక
- హౌస్ లో ఎదురైన పరిస్థితుల ప్రస్తావన
- రోటీల సీన్ చూసి అపార్థం చేసుకున్నారని వెల్లడి
- 'మౌనరాగం' సీరియల్ నిలబెట్టిందని వివరణ
బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడమే కాదు, తన ఆట తీరుతోను ప్రియాంక ఆకట్టుకుంది. టాప్ 5 వరకూ వెళ్లిన ప్రియాంక అక్కడి నుంచి నిరాశగా వెనుదిరక్క తప్పలేదు. తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ .. " బిగ్ బాస్ హౌస్ లో నేను ఎవరినీ డామినేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎవరి సపోర్టుతోనూ గెలవాలని కూడా అనుకోలేదు. నా ఆట నేను ఆడాను" అంది.
"హౌస్ లో నేను అదే పనిగా నా కష్టాలను చెప్పుకోలేదు. ఎందుకంటే సింపతీతో ఓట్లు రాబట్టాలని నేను అనుకోలేదు. రోటీలను నేను దాచిన విషయం హైలైట్ అయింది. ఎందుకు అలా చేశాననేది చూపించకపోవడం వలన ఆడియన్స్ అపార్థం చేసుకున్నారు. నిజానికి కొంతమంది మరుసటి రోజు ఉదయం కోసం రోటీలు దాచేస్తుంటే, వాళ్లకి కనిపించకుండా నేను దాచాను అంతే" అని చెప్పింది.
"నేను సీరియల్స్ వైపుకు రావడానికి ముందు, ఆర్ధికపరమైన ఇబ్బందులను ఫేస్ చేశాము. ఆ సమయంలో 'మౌనరాగం' సీరియల్ నన్ను ఆదుకుంది. అందుకు వాళ్లకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సీరియల్స్ లో చేస్తే ఇన్ కమ్ రెగ్యులర్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను సినిమాల నుంచి ఇటువైపు వచ్చాను. కొంతమంది వారించినా .. మా ఫ్యామిలీ పరిస్థితుల వలన అలా చేయవలసి వచ్చింది" అని అంది.