మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా

  • ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని పిటిషన్
  • హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నాగోల్‌కు చెందిన హరీందర్
  • ఇందులో ప్రజాప్రయోజనం లేదన్న హైకోర్టు
  • పిల్‌ను రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని నాగోల్‌కు చెందిన హరీందర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.

అయితే ఈ పిటిషన్‌లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ తాను ఇబ్బంది ఎదుర్కొని పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అమలు చేసింది.


More Telugu News