మలేసియా 17వ రాజుగా సుల్తాన్ ఇబ్రహీం... ఘనంగా పట్టాభిషేకం

  • రాచరికం కొనసాగిస్తున్న దేశాల్లో మలేసియా ఒకటి
  • 9 రాజకుటుంబాలతో మలేసియాలో ప్రత్యేక రాచరికపు వ్యవస్థ 
  • మలేసియా కొత్త రాజుగా నేడు పదవీప్రమాణస్వీకారం చేసిన సుల్తాన్ ఇబ్రహీం
ఇప్పటికీ రాచరికం కొనసాగిస్తున్న దేశాల్లో మలేసియా ఒకటి. తాజాగా మలేసియాకు కొత్త రాజు పట్టాభిషిక్తుడయ్యాడు. జోహార్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం (65) మలేసియాకు 17వ రాజుగా సింహాసనం అధిష్ఠించారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్ లో సుల్తాన్ ఇబ్రహీం నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 

మలేసియా రాజును స్థానిక పరిభాషలో 'యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్' అని పిలుస్తారు. మలేసియాలో తొమ్మిది రాజకుటుంబాలకు ఒక ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి ఈ 9 రాజకుటుంబాల అధిపతుల్లో ఒకరు వంతుల వారీగా రాజుగా పట్టాభిషిక్తులు అవుతుంటారు. 

మలేసియాలో రాచరికం అలంకార ప్రాయమే అయినప్పటికీ, రాజుకు ఉండే కొన్ని విచక్షణాధికారాల ద్వారా రాజకీయ అస్థిరతను అణచివేయడం సాధ్యమవుతుంది.


More Telugu News