నైజామ్ లో 'హను మాన్' 19 రోజుల వసూళ్లు ఇవే!
- ఈ నెల 12న విడుదలైన 'హను మాన్'
- సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన మూవీ
- 19 రోజుల్లో నైజామ్ వసూళ్లు 31.41 కోట్ల షేర్
- సీక్వెల్ గా రానున్న 'జై హను మాన్'
ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ మాట్లాడుకున్న సినిమా 'హను మాన్'. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా, సంక్రాంతి బరిలోకి దిగింది. మూడు పెద్ద సినిమాలతో పోటీపడిన ఈ సినిమా, చాలా తేలికగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడు.
విడుదలైన తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన జోరు చూపించింది. నిన్నటితో ఈ సినిమా 19 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 19 రోజుల్లో ఈ సినిమా నైజామ్ లో 31.41 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఆల్రెడీ లాభాల బాట పట్టిన ఈ సినిమా, తన జోరును ఇంకా కొనసాగిస్తూ ఉండటం విశేషం.
అంజనాద్రిని గ్రాఫిక్స్ లో చూపించిన తీరు .. ఇటు హీరో పాత్రను .. అటు విలన్ రోల్ ను డిజైన్ చేసిన తీరు .. యాక్షన్ సీన్స్ .. క్లైమాక్స్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా హైలైట్ అయింది. ఈ సినిమా సీక్వెల్ గా 'జై హనుమాన్' ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.