అమెజాన్ ప్రైమ్ తెరపైకి 'సైంధవ్'
- వెంకటేశ్ హీరోగా రూపొందిన 'సైంధవ్'
- జనవరి 13వ తేదీన విడుదలైన సినిమా
- అంచనాలను అందుకోలేకపోయిన కంటెంట్
- ఫిబ్రవరి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్
వెంకటేశ్ కథానాయకుడిగా 'సైంధవ్' సినిమా రూపొందింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేశారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రద్ధా శ్రీనాథ్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా కొనసాగుతుంది.
యాక్షన్ - ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. నెల తిరక్కుండానే ఈ సినిమా ఓటీటీ బాట పట్టడం విశేషం.
వెంకటేశ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువ. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ భారీగానే ఉంటాయి. అయితే ఆయన మార్క్ సినిమాల్లోనే ఆ యాక్షన్ సీన్స్ ను ఆడియన్స్ అంగీకరిస్తారు. 'సైంధవ్' సినిమా వెంకటేశ్ మార్క్ సినిమాలకి కాస్త దూరంగా కనిపిస్తుంది. ఈ కథ ఆడియన్స్ కి ఎక్కకపోవడానికి పండగ వాతావరణం కూడా ఒక కారణం కావొచ్చు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.