'కుమారి ఆంటీ' ఫుడ్ సెంటర్ మూసివేత చిచ్చు.. టీడీపీ, వైసీపీల మధ్య సోషల్ వార్
- జగన్ కు అనుకూలంగా మాట్లాడిందని కుమారిపై కక్ష సాధింపు చేశారన్న వైసీపీ
- తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి దాడి చేయించారంటూ మండిపాటు
- ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ వెల్లడి
తెలంగాణలో ఓ ఫుడ్ సెంటర్ మూసివేత ఏపీలో పార్టీల మధ్య వివాదం రేపింది.. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ప్రస్తుతం ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబర్లు, మీడియానే కారణమని నెటిజన్లు మండిపడుతుండగా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మూసివేయించారో తెలియట్లేదని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు.
కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. ఇక్కడ చిన్నగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఏపీలో ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ మీడియాకు చెప్పారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఆమె ఫుడ్ సెంటర్ మూతపడేందుకు కారణమైందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ కు అనుకూలంగా మాట్లాడిందనే కోపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కుమారి ఆంటీపై కక్ష సాధించారని ఆరోపించింది.