తిరుపతి యువకుడికి అరుదైన గౌరవం.. ఐన్‌స్టీన్ వీసాను మంజూరు చేసిన అమెరికా

  • ఆపిల్ సంస్థలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న రవితేజ
  • ఆయనలోని ప్రతిభను గుర్తించి ఈబీ-1 వీసా కోసం ప్రభుత్వానికి ఆపిల్ ప్రతిపాదన
  • రెండు  రోజుల క్రితం మంజూరు
తిరుపతి యువకుడు అరుదైన ఘనత సాధించాడు. ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే ఈబీ-1 వీసాను సొంతం చేసుకున్నాడు. స్థానిక నలంద నగర్‌కు చెందిన అనంత రవితేజ వాషింగ్టన్‌లోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

ఆయన ప్రతిభను గుర్తించిన సంస్థ ఈబీ-1 వీసాను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వీసాను మంజూరు చేసింది. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాను ఐన్‌స్టీన్ వీసా అని కూడా అంటారు.


More Telugu News