రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసిన హెచ్ఎండీఏ కమిషనర్

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శివబాలకృష్ణ
  • శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
  • ఆయన వద్ద దొరికిన స్థిర, చరాస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా కార్యదర్శి శివబాలకృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ ఇటీవల అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతను చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. ఏసీబీ అధికారులు ఇటీవల శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లో... 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. 

ప్రభుత్వ విలువ ప్రకారం... సోదాల్లో దొరికిన మొత్తం ఆస్తుల విలువ రూ.8,26,48,999గా ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్‌ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


More Telugu News