తెలంగాణలో రేపటితో ముగియనున్న రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు

  • గత ఏడాది డిసెంబర్ 27న ప్రారంభమైన రాయితీ చెల్లింపు
  • జనవరి 31 వరకు పొడిగించిన పోలీసులు
  • మరోసారి పొడిగించే అవకాశం లేదన్న పోలీసులు
రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు రేపటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు.

అయితే మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు మరొక్క రోజు మాత్రమే గడువు ఉంది. బైకులు, ఆటోల‌కు 80 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 90 శాతం, లారీ వంటి భారీ వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది.


More Telugu News