ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
- విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్న రేవంత్
- విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు
విప్లవ కవి, ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర వరకు ఆయన అన్నింటినీ ముందుండి నడిపించారు. గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగినప్పటికీ... దగ్గరుండి చూసుకున్నది రేవంతే. గత ఎన్నికల్లో కూడా గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. మరోవైపు, ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు కానుండటంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.