టీమిండియా టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రావడంపై పాకిస్థాన్ క్రికెటర్ స్పందన
- ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్
- గాయలతో టీమ్ కు దూరమైన జడేజా, రాహుల్
- జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్
సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరూ జట్టుకు దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు. డొమెస్టిక్ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ చెలరేగుతున్నాడు. జాతీయ జట్టులోకి రావాలన్న సర్ఫరాజ్ కల ఇప్పుడు నెరవేరింది. జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ కు సూర్యకుమార్ యాదవ్ తో పాటు ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశాడు.
దాయాది దేశం పాకిస్థాన్ నుంచి కూడా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ స్పందిస్తూ... 'అభినందనలు సోదరా... టీమిండియా జట్టులోకి నీవు రావడం చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. రెండో టెస్టు ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో లీడ్ లో ఉంది. మనకు అచ్చొచ్చిన వైజాగ్ పిచ్ పై మనవాళ్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.