టాలెంటుకి అదృష్టం తోడైతే ఆపడం కష్టమే .. మరో ఉదాహరణ సుహాస్!

  • చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చిన సుహాస్ 
  • హీరోగా తన ఖాతాలో రెండు సూపర్ హిట్లు
  • ఫిబ్రవరి 2వ తేదీన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'
  • హిట్ ఖాయమంటూ వినిపిస్తున్న టాక్

చిరంజీవి .. రవితేజ .. నాని .. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చినవారే. తమని తాము మలచుకుంటూ .. అశేష ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నవారే. ఆరంభంలో అనేక ఇబ్బందులు .. మధ్య మధ్యలో పరాజయాలు ఎదురవుతున్నా, తమ భుజం తామే తట్టుకుని నిలబడినవారే .. కష్టాలతో కలబడినవారే. 

ఆ జాబితాలోకి ఈ మధ్య కాలంలో వచ్చి చేరిన పేరు సుహాస్. మొదటి నుంచి కూడా అతనికి డాన్స్ అంటే ఇష్టం. అందువలన కొరియోగ్రాఫర్ కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాడు. అందుకోసం ట్రై చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వెళ్లాడు. అలా నెమ్మదిగా సపోర్టింగ్ రోల్స్ .. కమెడియన్ రోల్స్ .. విలన్ వేషాలు వేస్తూ వెళ్లాడు. అలా ఆ అడుగులను హీరోయిజం వైపు మళ్లించాడు. 

అలా సుహాస్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ, 'కలర్ ఫొటో' .. ' రైటర్ పద్మభూషణ్' వంటి సినిమాలతో విజయాలను అందుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి రావడానికి 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది .. హిట్ కొట్టడం ఖాయమనే టాక్ ఉంది. టాలెంటుకి అదృష్టం తోడైతే ఆపడం కష్టమేననే విషయం సుహాస్ విషయంలో మరోసారి నిరూపితమైంది.


More Telugu News