తాలిబన్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో మీటింగ్.. పాల్గొన్న భారత్!

  • పది దేశాల దౌత్యవేత్తలతో తాలిబన్‌ల ఆధ్వర్యంలో సోమవారం సమావేశం
  • సమావేశానికి హాజరైన భారత్
  • ఆప్ఘనిస్థాన్ వ్యవహారాల్లో భారత్ పూర్తి మద్దతు ఇస్తోందన్న తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల పరమై చాలా కాలమే అయినా ప్రపంచదేశాల ప్రభుత్వాలు వారి ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అయితే, తాలిబన్ ప్రభుత్వ విదేశాంగ శాఖ సోమవారం ఏర్పాటు చేసిన దౌత్యవేత్తల సమావేశంలో భారత్ సహా వివిధ దేశాలు పాల్గొన్నాయి. రష్యా, చైనా, ఇరాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌, కజకస్థాన్, కిర్గిస్థాన్, టర్కీ, ఇండోనేషియా ఈ మీటింగ్‌కు హాజరయ్యాయి. అయితే, ఈ సమావేశంపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

కాగా, ఈ సమావేశానికి ముందు ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొనాలని, తమ దేశంలోని అవకాశాలను వినియోగించుకోవాలని వివిధ దేశాలకు పిలుపునిచ్చింది. రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు వివిధ దేశాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొంది. 

కాగా, మీటింగ్‌లో భారత్‌ పాల్గొనడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్ఘానిస్థాన్ వ్యవహారాలకు సంబంధించి భారత్ అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా క్రీయాశీలకంగా ఉందని పేర్కొన్నారు. ఆ దేశంలో అభివృద్ధికి, సుస్థిరతకు భారత్ మద్దతిస్తోందని వెల్లడించారు.


More Telugu News