అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి.. నిర్ధారించిన యూనివర్సిటీ

  • పర్‌డ్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న నీల్ ఆచార్య
  • ఆదివారం నుంచి ఆచూకీ గల్లంతు
  • ఎక్స్‌లో సాయం కోరిన ఆచార్య తల్లి
  • యూనివర్సిటీతో టచ్‌లో ఉన్నామన్న భారత రాయబార కార్యాలయం
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్‌డ్యూ యూనివర్సిటీలోని జాన్ మార్టిన్సన్ ఆనర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డేటా  సైన్స్ డబుల్ మేజర్ అయిన నీల్ ఆచార్య అదృశ్యమైనట్టు ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అతడు చనిపోయినట్టు తాజాగా నిర్ధారించారు. నీల్ ఆచార్య మృతిచెందిన విషయం చెప్పడానికి విచారిస్తున్నట్టు పేర్కొంటూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్ క్రిస్ క్లిఫ్టన్ లేఖ రాశారు. ఆచార్య కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.   

ఈ నెల 28 నుంచి కనిపించకుండా పోయిన తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య ఎక్స్‌ ద్వారా సాయం కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆచార్యను చివరిసారి ఉబెర్ డ్రైవర్ చూశాడు. యూనివర్సిటీ వద్ద ఆచార్యను వదిలిపెట్టింది అతడే. ఆ తర్వాతి నుంచి విద్యార్థి ఆచూకీ మాయమైంది. ఆచార్య తల్లి పోస్టుకు స్పందించిన షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.


More Telugu News